చినాబ్ నదిపై 46 వేల కోట్ల రూపాయల వ్యయంతో నిర్మించిన రైల్ వంతెనలను ప్రారంబించి జాతికి అంకితం చేసిన ప్రధాని. ఈ రోజు జమ్ము కాశ్మీర్ కాట్రా మధ్యన నిర్మించిన చీనాబ్, అంజి భారీ వంతెనలను ప్రారంబించి అదే వంతెనల పై కాట్రా వరకు ప్రయాణించినారు. కాట్రా శ్రీనగర్ మధ్య వందే భారత్ రైలును ప్రారంభించి అందులో ప్రయాణిస్తున్న ప్రయాణికులతో ముచ్చటించిన ప్రధాని, కాట్రాలో జరిగిన భహిరంగ సభలో ప్రసంగిస్తూ కాశ్మీర్ రాష్ట్ర అభివృద్దికి అత్యంత ప్రాధాన్యత ఇస్తున్నట్లు ఆయన తెలిపారు, ఈ కార్యక్రమంలో ఆయన వెంట జమ్ము కాశ్మీర్ ముఖ్యమంత్రి ఓమర్ అబ్దుల్లా పాల్గొన్నారు. ఈ వంతెన నిర్మాణంలో పాలుపంచుకున్న పలువురితో ముచ్చటించి వారిని ప్రశంశించినారు.
