అమెరికా అధ్యక్షులు డోనాల్డ్ ట్రంప్ భారత ఆర్ధిక వ్యవస్ధ చనిపోయింది అని వ్యాఖ్యానించి భారత ఆర్ధిక వ్యవస్ధ డొల్ల తనాన్ని బయటపెట్టాడా… ? ఈ వ్యాఖ్యలు భారత దేశంలో పెను దుమారాన్ని రేపాయి, ఇది ఆర్ధిక మేధావులను మరియు నిపుణులను ఫుణఃరాలోచన చేయాల్చింసిన సందిగ్ధం లో పడేసింది, ప్రపంచంలో పెద్దన్న పాత్ర పోషించే అమెరికా అధ్యక్షులు ఈ మాటలు అనడం అంటే అంత ఆషామాషీగా తీసుకొరు. అమెరికా నిగూఢ వర్గాల సమాచారం లేకుండా ఇలాంటి వ్యాఖ్యలు ఆయన చేయరు. దీనినే రాహుల్ గాంధీ ప్రస్ధావిస్తూ నోట్లరద్దు మరియు GSTలు లోపాయి కారీ తనంతో చేసినవని, మేకిన్ ఇండియా ఆశించిన ఫలితాలు ఇవ్వలేదని, సూక్ష్మ, చిన్నతరహా పరిశ్రమలు దేశంలో తుడిచి పెట్టుకు పోయాయని, దేశవ్యాప్తంగా వ్యవసాయం గిట్టుబాటు లేదని, కానీ అదానీ-మోడీ ద్వయం మాత్రం చక్కగా ఉన్నారని అలాగే మోడీ పాలనలో దేశ యువత భవిష్యత్తును నాశనం చేశారని అన్నారు. అలాగే అమెరికా అధ్యక్షులు భారత ఆర్ధిక వ్యవస్ధ డొల్లతనాన్ని భయటపెట్టినా మోడీ మాత్రం తన వాక్ చాతుర్యంతో 140 కోట్ల భారతీయులను మబ్యపెడుతున్నారని రాహుల్ గాంధీ గారు దుయ్యబట్టారు.