వైకాపా ఆద్వర్యంలో… చలో మెడికల్ కాలేజ్

Share Now

ఈ రోజు రాష్ట్ర వ్యాప్తంగా వైకాపా పార్టీ యువజన, విధ్యార్ధి, సోషల్ మీడియా విభాగాల ఆధ్వర్యంలో పిలుపు నిచ్చిన చలో మెడికల్ కాలేజీ అనే శాంతియుత నిరసన కార్యక్రమం. ముందస్తు జాగ్రత్తగా పలువురు వైకాపా నాయకుల గృహ నిర్బందం, అలాగే పలువురు నేతలను నిరసన కార్యక్రమానికి అనుమతి లేదంటూ అడ్డుకున్న పోలీసులు. ప్రభుత్వ మెడికల్ కాలేజీలను అప్పనంగా తనకి అయిన వారికి దోచి పెడుతున్న ప్రభుత్వం అంటూ, వేల కోట్ల రూపాయలు విలువైన కాలేజీ భవనాలను పీపీపీ ముసుగులో నామ మాత్రం ధరకే తనకు అయిన వారికి అప్పణంగా అప్పగింత అంటూ. కాంట్రాక్ట్‌ ఎవరికి ఇవ్వాలనే దానిపై ముందే ఫిక్స్ చేసుకొని తర్వాత మొక్కుబడిగా టెండర్లు పిలిచారు అని, మెడికల్ కాలేజీల కోసం రూ.5 వేల కోట్లు ఖర్చు చేస్తే పూర్తి అయ్యే దానికి ప్రైవెటు పరం చేయడం ఏందుకని ఇది మంచి ప్రభుత్వం కాదు అని పలువురు వైకాపా నేతలు నినదించారు.
గత ప్రభుత్వంలో రాష్ట్ర మొత్తం మీద 17 మెడికల్ కాలేజీలు 8500 కోట్లతో శ్రీకారం చుట్టారు, అందులో ఐదు కాలేజీలు పూర్తయి తరగతులు కూడా ప్రారంభమయ్యాయి. అలాగే రెండు కాలేజీల్లో 2024-25 సంవత్సరానికి గాను తరగతులు ప్రారంభించుకోవచ్చని NMC 50 MBBS సీట్లను మంజూరు కూడా చేయడం జరిగింది. కానీ కూటమి ప్రభుత్వం సౌకర్యాలు లేవని NMC కి తిరిగి లేఖ రాయడం జరిగినది అని. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి దాదాపు 15 నెలలు పూర్తవుతున్న ఏ ఒక్క మెడికల్ కాలేజీ లో కూడా ఒక ఇటుక కూడా పెంచకుండా గత ప్రభుత్వంలో కట్టిన మెడికల్ కాలేజీలను కూడా ప్రైవేటీకరణ చేయడం, నిరు పేదలకు ఉపయోగపడే వైద్య విద్యను పేద విద్యార్థులకు దూరం చేయడంతో పాటు పేద ప్రజలకు వైద్యమును కూడా దూరం చేయాలని ప్రభుత్వం చూస్తోందని పలువురు వైసిపి నేతలు వాపోయారు.
కూటమి ప్రభుత్వం తీసుకున్న మెడికల్ కాలేజీ ప్రైవేటీకరణను వెనక్కి తీసుకోవాలని అలాగే అసంపూర్తిగా ఉన్న మెడికల్ కాలేజీలను వెంటనే పూర్తి చేయాలని 2026-27 ఆకడమిక్ సంవత్సరానికి తరగతులను ప్రారంభించాలని పలువురు డిమాండ్ చేయడం జరిగింది.
గత ప్రభుత్వంలో ప్రభుత్వమే స్థలాలు కేటాయించి, భవనాలు నిర్మించి , సౌకర్యాలు కల్పించిందని వీటిని ప్రైవేట్ పరం చేయడం దుర్మార్గపు చర్యగా పేర్కొన్నారు. కావాలి అంటే కొత్తగా ప్రైవేట్ కాలేజీలకు అనుమతులు తెచ్చి ప్రైవేట్ భాగస్వామ్యంలో నిర్మించుకోవచ్చు అని కూటమి ప్రభుత్వాన్ని వైకాపా నేతలు ప్రశ్నించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *