కర్నూలు బస్ దగ్ధం ముమ్మాటికీ ప్రభుత్వ అధికారుల నిర్లక్ష్యమే. 21 మంది ప్రయాణికులను పొట్టన పెట్టుకున్న సంఘటనలో ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకున్న ధాఖలాలు ఏవీ కనిపించడం లేదు, స్టేట్ బార్డర్ చెక్ పోస్టు అసలు ఉందా? ఉంటే తనికీలు చేయరా, ప్యాసింజర్ వెహికల్ లో 200 పై చిలుకు మోబైల్ ఫోన్లు ఏలా రవాణా చేస్తున్నారో సందేహాస్పదం, సెల్ ఫోన్ల లో వాడే లిధియం అయాన్ బ్యాటరీలు అత్యదిక ఉష్ణోగ్రత వద్ద పేలుడు సంభవించే ప్రమాదం ఉంది ఈ కారణంగానే బస్సులో ప్రమాద తీవ్రత స్ధాయి పెరిగి ఉండవచ్చు. ప్రభుత్వ అధికారులు ప్రైవేట్ ట్రావెల్ మాఫియా మామూల్ల మత్తులో బాగానే మునిగి తేలుతున్నట్లున్నారనే ప్రశ్న తేటతెల్లం అవుతోంది. ఇప్పటి వరకు బాద్యులైన అధికారులను సస్పెండ్ చేయక పోవడం, అలాగే కావేరి ట్రావెల్స్ యాజమాన్యం పై సరియగు చర్యలకు పూనుకోకపోవడం ప్రభుత్వం ఈ విషయంపై మీన మేషాలు లెక్కిస్తోంది అనే సందేహం ప్రజలలో తలెత్తుతోంది. అంతే కాకుండా ఈ ఘటనలో ఇప్పటివరకు బస్ డ్రైవర్ పరారీలో ఉండగా, మోబైల్ ఫోన్లు రవాణా చేస్తూ పట్టు బడ్డ బస్సు యాజమాన్యం ని అదుపులోకి తీసుకోకుండా పోలీసులు మమా అనేలా అసిస్టెంట్ డ్రైవర్ని అదుపులోకి తీసుకోవడం. ప్రభుత్వాలకు సామాన్యుల ప్రాణాల పట్ల ఏంత భాద్యతో తేటతెల్లమౌతోంది.