FCI సొసైటీ భూ ఆక్రమణపై తెలంగాణ హైకోర్టు తీర్పు

Share Now

గచ్చిబౌలిలోన గల 20 ఎకరాల ఎఫ్‌సీఐ సొసైటీ భూమిని ఆక్రమించినందుకు సంధ్య కన్వెన్షన్ హాల్ యజమానిని బాధ్యులుగా తేల్చిన తెలంగాణ హైకోర్టు. ప్రైవేట్ ప్లాట్లను విస్తరించడానికి అనేక రోడ్లు మరియు ఖాళీ స్థలాలు అక్రమంగా ఆక్రమించబడుతున్నాయని హైకోర్టు గమనించింది, జస్టిస్ విజయసేన్ రెడ్డి ప్లాట్ యజమానులకు హైకోర్టు మద్దతుగా ఉంటుందని హామీ ఇచ్చారు, తరువాత చర్యల కోసం కూడా ఆదేశించారు.

బాద్యులు సంధ్య కన్వెన్షన్ హాల్ యజమాని అయిన సంధ్య శ్రీధర్ రావు గచ్చిబౌలిలోని భూ ఆక్రమణలకు బాధ్యులుగా తెలంగాణ హైకోర్టు నిర్ధారించింది. ఆక్రమణకు గురైన స్థలం గచ్చిబౌలిలోని ఫెర్టిలైజర్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (FCI) ఎంప్లాయీస్ కోఆపరేటివ్ హౌసింగ్ సొసైటీకి చెందిన 20 ఎకరాల లేఅవుట్ లో నందలి గల, 162 ప్లాట్లు ఉన్న ఈ లేఅవుట్‌లోని రోడ్లు మరియు పబ్లిక్ స్థలాలు (పార్కులు) అక్రమంగా ఆక్రమించబడ్డాయి. ప్రైవేట్ ప్లాట్లను విస్తరించడానికి ఈ పనులకు పాల్పడినట్లు కోర్టు గుర్తించింది. ఇటువంటి అక్రమ ఆక్రమణలను సహించబోమని కోర్టు తీవ్రంగా హెచ్చరించింది. ఒక లేఅవుట్‌ను ఆమోదించిన తర్వాత, దానిని ప్రణాళిక ప్రకారం అమలు చేయాలని నొక్కి చెప్పింది.
హైదరాబాద్ డిజాస్టర్ రెస్పాన్స్ అండ్ అసెట్ ప్రొటెక్షన్ ఏజెన్సీ (HYDRAA) గతంలో ఈ ఆక్రమణలను తొలగించిందినా యదావిదిగా శ్రీధర్ రావు తన అనుచరులతో కబ్జాలకు పాల్పడ్డారు దీనితో ప్లాట్ల యాజమానులు కోర్టును ఆశ్రయించారు. దీనితో రోడ్లు మరియు పార్కులను పునరుద్ధరించాలని కోర్టు HYDRAAను ఆదేశించడం జరిగింది.

శ్రీధర్ రావు హద్దులు, రోడ్లు, పార్కులను గౌరవించకుండా నిర్మాణాలు చేస్తున్నారని ప్లాట్ యజమానులు ఆరోపించారు. ఇతర యజమానులను భయపెట్టడానికి మరియు లేఅవుట్‌పై ఆధిపత్యం చెలాయించడానికి ఆయన అనేక ప్లాట్లను కొనుగోలు చేసినట్లు ఆరోపించారు.

బెదిరింపులు, దాడులు: శ్రీధర్ రావు మరియు అతని అనుచరుల నుండి బెదిరింపులు మరియు దాడులు ఎదురైనట్లు బాధితులు కోర్టుకు తెలిపారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *