నూడా పేరుతో అక్రమ లేఅవుట్ లు: అవినీతి నిరోదక శాఖ అదికారుల తనిఖీలు.

Share Now

నెల్లూరు అర్బన్ డెవలప్మెంట్ అధారిటీ కార్యాలయంలో అవినీతి నిరోధక శాఖ అధికారుల ఆకస్మిక దాడులు గత ప్రభుత్వం హయాంలో నూడా పేరుతో పలు అక్రమ లేఔట్లు. వైకాపా నాయకుల అండదండలతో పేడూరు, బుచ్చిరెడ్డి పాలెంలలో పలు లేఅవుట్ లపై ముఖ్యమంత్రి కార్యాలయానికి ఫిర్యాదులు రావడంతో వాటిపై నిఘా పెట్టిన అధికారులు. నూడా కనీస నిభంధనగా లే ఔట్ అనుమతి పొందే లేఅవుట్ నకు అప్రోచ్ రోడ్డు గా కనీసం తారు రోడ్డు ఉండాలి పేడూరు గ్రామ పంచాయితీలో గత ప్రభుత్వంలో అనుమతి పొందిన లే అవుట్ నకు నిభందనలను తుంగలో తొక్కి గ్రావెల్ డొంక రోడ్డు లో నూడా లేఅవుట్ అనుమతి మంజూరు చేసినట్లు అలాగే సదరు లే అవుట్ నందలి ఓన్ టైం సెటిల్మెంట్ కింద కన్వర్షన్ కాకూడని నిషేదిత భూములను కూడా కన్వర్షన్ చేసినట్లు ముఖ్యమంత్రి కార్యాలయానికి ఫిర్యాదులు. అంతే కాకుండా BRS/LRS లో పలు అవకతవకలపై ప్లానింగ్ విబాగంలో పలు ఫైల్లు పరిశీలించి, పలు అక్రమాలు జరిగినట్లు వీటిపై లోతైన ధర్యాప్తు జరుపుతున్న అవినీతి నిరోదక శాఖ అదికారులు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *