ప్రభుత్వానికి న్యాయస్ధానాలు, రాజ్యాంగ వ్వవస్ధ లంటే లెక్కలేదా…? నెల్లూరు జిల్లా, కావలి పట్టణం పరిధిలో వివిధ సర్వే నంబర్లలో గల కాలువలపై రియల్ ఏస్టేట్ వెంచర్లు వెలిశాయంటూ జూలై5, 2024న కావలి పట్టణానికి చెందిన మనం ఫౌండేషన్ అనే స్వచ్చంధ సంస్ధ ప్రజా ప్రయోజన వాజ్యం కోరుతూ గౌరవ ఆంధ్రప్రధేశ్ హైకోర్టును ఆశ్రయించడం జరిగింది.
సధరు పిల్ WP(PIL)135/ 2024 నెంబరు పై స్పందించిన ప్రధాన న్యాయ మూర్తి అంధ్రప్రధేశ్ ప్రభుత్వాన్ని మరియు రెవెన్యూ, పంచాయతీ రాజ్, పట్టణాభివృద్ది శాఖ లను ప్రతి వాదులుగా చేర్చగా, ప్రభుత్వం వాటర్ బాడీస్ యాక్ట్ ప్రకారం సదరు లేఔట్లపై చర్యలు తీసుకుందుము అనే ఆంధ్రప్రధేశ్ ప్రభుత్వ పూచీతో డిసెంబర్ 18, 2024 న ఆంధ్రప్రదేశ్ హైకోర్ట్ ప్రధాన న్యాయ మూర్తి గారు సదరు పిల్ ను డిస్పోజ్ చేయడం జరిగింది. కానీ ఇప్పటివరకూ ఈ లేఔట్ల కుంభకోణం పై ప్రభుత్వం చిత్తశుద్ది తో విచారణ జరిపిన ధాఖలాలు లేవు. ఈ అక్రమ లేఔట్ లను వేసి మధ్య తరగతి ప్రజలను నిండా ముంచిన ఆ యొక్క యజమానులపై క్రిమినల్ కేసులు పెట్టడం గానీ, ప్రభుత్వ కాలువ భూముల తాలూకు కబ్జాలు జరిగినా చోధ్యం చూసిన రెవెన్యూ డివిజనల్ స్ధాయి అధికారులపై విచారణ మరియు మండల స్ధాయి అధికారులు అలాగే ఈ లేఔట్ లకు సహకరించిన సబ్ రిజిస్ట్రార్ తదితర అధికారులపై చర్యలకు ఉపక్రమించడం గాని జరుగలేదు.
కావలి పట్టణంలో ఇంతటి భూదందా జరిగిన కాలంలో భాద్యతా రాహిత్యంగా వ్యవహరించిన అప్పటి రెవెన్యూ అధికారులు ఇప్పుడు దేవాదాయ శాఖలో ఉన్నత పదవుల్లో తిస్ఠ వేయడం చూస్తే ఈ వ్యవహారంలో ప్రభుత్వం యొక్క చిత్తశుద్దిని శంకించవలసి వస్తుంది. ఇప్పటికే ప్రభుత్వం హైకోర్టు నందు పూచీకత్తు సమర్పించి 19 నెలలు కావస్తున్నా ఇంకా పూర్తి స్ధాయిలో విచారణ లేక పోవడం అంటే ఈ కుంభకోణంలో ఏంతటి స్ధాయి ఘనులు ఉన్నారో ఇట్టే తేటతెల్లమౌతోంది? ప్రభుత్వం త్వరిత గతిన సధరు లేఔట్ లకు సహకరించిన ప్రభుత్వ అధికారులపైన చర్యలకు ఉపక్రమించి, దీనిపై కాలయాపన విజిలెన్స్ విచారణ తో కాకుండా ప్రత్యేక ధర్యాప్తు బృంధంతో విచారణ చేపట్టి రియల్ కేటుగాల్లను శిక్షించాలని కావలి పుర వాసులు కోరుకుంటున్నారు.