మధనపల్లి లో పేద పొదుపు మహిలల సొమ్ములు స్వాహా…

Share Now

మధనపల్లి : మున్సిపాలిటీ పరిధి లో గల చాకలి మిట్ట ప్రాంతానికి చెందిన శివాజీ స్లమ్ సమాఖ్య లో పేద పొదుపు మహిళలకు చెందిన 75 లక్షల రూపాయలు నిధులు కాజేసిన మెప్మా రిసోర్స్ పర్సన్. సదరు సమాఖ్య నందలి 31 పొదుపు సంఘాలకు గాను రిసోర్స్ పర్సన్ గా వ్యవహరిస్తున్న జ్యోతి పై స్థానిక మదనపల్లి పట్టణ మొదటి పోలీస్ స్టేషన్ అధికారి గారికి బాధిత పొదుపు మహిళలు ఫిర్యాదు చేయడం జరిగినది. సదరు మహిళా సమాఖ్య అధ్యక్షురాలు పి. సుజన, కార్యదర్శి ఆర్. కోమల, కోశాధికారి ఎం. రేష్మ వారి నేతృత్వంలో ఖాతాలను పరిశీలించగా, 20 ఖాతాలకు చెందిన 75 లక్షల రూపాయలు నగదు బ్యాంకులలో జమ చేయలేదని గుర్తించారు సదరు మొత్తాన్ని ఆర్పి తన సొంత ఖాతాలకు మళ్ళించడంతోపాటు సమాఖ్య నిధులను సొంత అవసరాలకు వినియోగించుకున్నట్లు బాధిత మహిళలు ఆరోపిస్తున్నారు. ఇందులో బ్యాంకు లింకేజీ నిధులు 32 లక్షల రూపాయలు, సంఘాల పొదుపులు 21 లక్ష రూపాయలు, సమాఖ్య పొదుపులు 21 లక్షల రూపాయలు నిధులు మాయమైనట్లు గుర్తించారు. సదరు నిధుల విషయమై RP జ్యోతిని సమాఖ్య సభ్యులు వివరణ అడుగగా తిరిగి చెల్లిస్తానని హామీ ఇచ్చినారు, అయినప్పటికీ ఇప్పటివరకు సదరు నిధులు జమ చేయక పోవడంతో బాధిత పొదుపు మహిళలు మదనపల్లి మొదటి పట్టణ పోలీస్ స్టేషన్ నందు ఆర్పీ జ్యోతి పై ఫిర్యాదు చేయడం జరిగినది.

ఇదివరకే మదనపల్లి పట్టణంలో సంచలనం రేకెత్తించిన 20 డూప్లికేట్ గ్రూపుల తో మెప్మా అధికారులు, బ్యాంకు అధికారులు కలిసి కాజేసిన రెండు కోట్ల రూపాయలు స్కాం ను మరువక ముందే మెప్మాలో మరో స్కాం బయట పడడంతో మెప్మా లో ఇంటి దొంగలు ఎంతటి ఘనులో ఇట్టే అర్థమవుతుంది. మధనపల్లి పట్టణ సిటీ మిషన్ మేనేజర్ మరియు ప్రాజెక్ట్ డైరెక్టర్ వారు అలాగే జిల్లా పర్యవేక్షణ అధికారి ఇలాంటి సంఘటనలపై సరియగు రీతిలో స్పందించకపోవడం చూస్తుంటే మెప్మా యొక్క దివాలా కోరుతనానికి ఇట్టే దర్పణం పడుతుంది. మదనపల్లి పట్టణంలో పదేపదే ఇలాంటి అమాయక పొదుపు మహిళల పేరుతో డూప్లికేట్ గ్రూపుల స్కాములు మరియు పొదుపు నిధుల గోల్మాల్ అలాగే మదనపల్లి పట్టణ సమాఖ్యలో నిధుల స్వాహా చూస్తుంటే మధనపల్లి పట్టణ మహిలా సమాఖ్య పరిధిలో గల పొదుపు గ్రూపుల నిధుల లూటీపై విజిలెన్స్ విచారణ మరియు జిల్లా కలెక్టర్ గారి ప్రత్యేక పర్యవేక్షణ ఈ శాఖపై అవసరం అని తేటతెల్లమవుతుంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *