న్యూఢిల్లీ : CJP పార్టీకి ఏదో ప్రచార ఆర్భాటం తప్ప భారత రాజ్యాంగం వ్యవస్థ నిర్మాణం గురించి సరి అయిన అవగాహన లేనట్లుగా తెలుస్తోంది. ఆర్టికల్ 324 ద్వారా స్థాపించబడిన భారత ఎన్నికల సంఘానికి ఎక్కడా లేనటువంటి విచక్షణ అధికారాలు ఉన్నాయి, ఈ ఆర్టికల్ ద్వారా వారు పార్లమెంట్ ఎన్నికలను మరియు అసెంబ్లీ అభ్యర్థుల ఎన్నికలను అలాగే ప్రెసిడెంట్ వైస్ ప్రెసిడెంట్ ఎన్నికలను నిర్వహించగలిగే స్వయం ప్రతిపత్తి కలిగి ఉన్న సంస్ధ దీనిలో అత్యున్నత స్ధాయిలో చీఫ్ ఎలక్షన్ కమిషనర్ విధులు నిర్వహిస్తారు. ఆర్టికల్ 324 పార్ట్ 15 ద్వారా వీరు ఎన్నికలను ఎలా నిర్వహించాలి అనేదాని పై కూడా విశిష్ట అధికారాలు కలిగి ఉంటారు దీనిని ఏవరూ ప్రశ్నించ లేరు, భారతీయ పౌరులు మాత్రమే ఏన్నికల ధ్వారా రాజకీయ పార్టీల అభ్యర్ధులను ఏన్నుకోవాలి కాని దురధ్రష్టవశాత్తు గతంలో పలురాష్ట్రాలలో ఓటరు నమోదు కార్యక్రమంలో అక్రమాలు జరిగాయి దానిని సరిచేయను పార్ట్ 15 ద్వారా SIR ప్రక్రియను భారత ఏన్నికల సంఘం గత కొంత కాలంగా నిర్వహించు చున్నది. ఒకసారి ఎన్నికల నోటిఫికేషన్ విడుదలైన తర్వాత వారి వ్యవహారాలలో జుడీషియల్ సిస్టం కూడా తల దూర్చలేదు, ఇంతటి విశిష్ట అధికారాలు కలిగినటువంటి భారత ఎన్నికల సంగం విధి నిర్వహణలో కనీసపాటి గుర్తింపు కూడా లేని కాక్రోచ్ జనతా పార్టీ తల దూర్చడం అంటే అది వారికి భారత రాజ్యాంగంపై పట్టు లేదని తెలుస్తోంది.

ఇదివరకు టి.ఎన్ శేషన్ లాంటి భారత ఎలక్షన్ కమిషనర్లు ECI రాజకీయ వ్యవస్థల చేతిలో కీలుబొమ్మ కాదని దాని సత్తా ఏమిటో ప్రత్యక్షంగా చూపించారు. రాజ్యాంగం బద్ధంగా విశిష్ట అధికారాలు కలిగినటువంటి రాజ్యాంగ బద్ధ సంస్థలపై సరి అగు ఆధారాలు లేకుండా నిందలు మోపడం రాజ ద్రోహమే వీరి వెనక ఉన్న రాజ్యాంగేతర శక్తులే CJP పార్టీని నడిపిస్తున్నాయి అని రాజ్యాంగ నిపుణులు అభిప్రాయపడుతున్నారు. అలాగే వీరు భారత ఎన్నికల కమిషనర్ యొక్క బేషరతు రాజీనామాకు 48 గంటలు తుది గడుపు ఇవ్వడం ఏమిటి, దీని వెనుక వెనుక ఏదైనా రాజ ద్రోహ కుట్ర దాగి ఉందా?. ఎందుకంటే ఈ పార్టీ ఇప్పటి వరకు గుర్తింపు లేదు అలాగే దేశంలో ఎక్కడ ప్రత్యక్ష ఎన్నికలలో పాల్గొన్న దాఖలాలు కూడా లేవు, కనుక వీరికి ఎన్నికల సిస్టం గురించి ఎటువంటి అవగాహన కూడా లేదు ఇది ఒక సోషల్ మీడియా వేదికగా పుట్టుకొచ్చిన ఓ కుహనా రాజకీయ సంస్థ, CJP పార్టీ చీఫ్ ఏలక్షన్ కమీషనర్ రాజీనామా పిలుపుతో వీరికి రాజ్యాంగ వ్యవస్థల పట్ల ఎంత అవగాహన ఉంది అనేది తేటతెల్లమవుతోంది. లోగడ విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ గారి రాజీనామా విషయంలోనూ ఢిల్లీ వేదికగా వీరు చేసిన ఆగడాలు మరియు అరాచకాలు చూసాం. వీరికున్న మిడిమిడి జ్ఞానంతో రాజ్యాంగ బద్ధ సంస్థల మీదే బురద జల్లడం అంటే వీరు ఎంత పార్టీ న్యాయ శాస్ర ప్రావీణ్యులో అనేది తేటతెల్లమవుతుంది. కనుక భారత ప్రధాని మోడీ గారు తక్షణమే స్పందించి దేశ రాజధాని ఢిల్లీ నగరాన్ని మరలా భయభ్రాంతులకు గురి చేయకుండా ముందస్తు చర్యగా కర్ఫ్యూ లేదా కట్టు దిట్టమైన భద్రత ఏర్పాట్లు చేయాలని, మరలా వీరు ఢిల్లీ వేదికగా ధర్నా పేరుతో చేపట్టబోయే అరాచకాన్ని నిరోధించి కాక్రోచ్ జనతా పార్టీ వారి ఆగడాలకు ఫుల్ స్టాప్ పెట్టాలని ప్రజలు కోరుతున్నారు. అలాగే దేశ యువత కూడా CJP లాంటి గుర్తింపులేని పార్టీల పిలువుతో అప్రమత్తతగా వ్యవహరించాలని లేదంటే వీరు భవిష్యత్తులో తీవ్రంగా నష్టపోయే ప్రమాదం ఉందని హితవు.