ఘణంగా మాగుంట జన్మదిన వేడుకలు …

Share Now

ఒంగోలు: నగరంలో మాగుంట అభిమానుల కోలాహలం నెలకొంది. రాంనగర్ 2వ లైనులోని మాగుంట కార్యాలయంలో అభిమానులు అత్యంత వైభవంగా జన్మదిన వేడుకలను నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఒంగోలు పార్లమెంట్ సభ్యులు శ్రీ మాగుంట శ్రీనివాసులు రెడ్డి, శ్రీ మాగుంట రాఘవ రెడ్డి, మరియు శ్రీ మాగుంట నిఖిల్ బాబు హాజరయ్యారు. అభిమానులు ఏర్పాటు చేసిన ప్రత్యేక కేక్ కటింగ్ కార్యక్రమంలో పాల్గొన్న ఎంపీ మాగుంట శ్రీనివాసులు రెడ్డి, ఆయన అందరికీ కృతజ్ఞతలు తెలిపారు. ఈ వేడుకల్లో పలువురు ప్రముఖ రాజకీయ నాయకులు పాల్గొని శుభాకాంక్షలు తెలియజేశారు. ప్రకాశం జిల్లా లోని ప్రముఖ రాజకీయ నాయకులు ఓంగోలు శాసనసభ్యులు శ్రీ దామచర్ల జనార్దన్ రావు, పర్చూరు శాసన సభ్యులు ఏలూరి సాంబశివరావు, కనిగిరి మాజీ శాసనసభ్యులు శ్రీ ముక్కు ఉగ్ర నరసింహ రెడ్డి , ఓంగోలు మాజీ మేయర్ శ్రీమతి గంగాడ సుజాత, నాయకులు శ్రీ తాతా ప్రసాద్, శ్రీ కుప్పా రంగసాయి, శ్రీ అయినా బత్తిన ఘనశ్యామ్, శ్రీ ఆత్మకూరి బ్రహ్మయ్య, శ్రీ బెల్లం సత్యనారాయణ ఈ కార్యక్రమంలో భారీ సంఖ్యలో పార్టీ నాయకులు, కార్యకర్తలు, మరియు మాగుంట కుటుంబ అభిమానులు పాల్గొని వేడుకను విజయవంతం చేశారు. కార్యాలయం అంతా అభిమానుల నినాదాలతో మార్మోగింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *