మోగిన స్థానిక సంస్థల ఎన్నికల నగారా : మూడు విడతల్లో పోలింగ్

Share Now

ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికల షెడ్యూల్ విడుదల:

అమరావతి: ఆంధ్రప్రదేశ్‌లో స్థానిక సంస్థల ఎన్నికల నగారా మోగింది. రాష్ట్ర ఎన్నికల కమిషనర్ (ఎస్‌ఈసీ) అనిల్ చంద్ర పునేఠా బుధవారం విజయవాడలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మున్సిపల్, మండల, జిల్లా పరిషత్, మరియు గ్రామ పంచాయతీ ఎన్నికలకు సంబంధించిన పూర్తి షెడ్యూల్‌ను అధికారికంగా విడుదల చేశారు. ఈ నోటిఫికేషన్ ప్రకటనతోనే రాష్ట్రవ్యాప్తంగా ఎన్నికల నియమావళి (కోడ్) తక్షణమే అమల్లోకి వచ్చిందని ఎస్‌ఈసీ స్పష్టం చేసింది. మొత్తం మూడు విడతలుగా ఈ ఎన్నికల ప్రక్రియ సాగనుంది. ఇప్పటికే మున్సిపాలిటీలు, కార్పొరేషన్లు, జెడ్పీ స్థానాలకు రిజర్వేషన్లు ఖరారయ్యాయని, అన్ని చోట్లా మహిళలకు సమాన ప్రాతినిధ్యంతో సీట్లు కేటాయించినట్లు అధికారులు వెల్లడించారు.

ఎన్నికల పూర్తి షెడ్యూల్ వివరాలు:

మున్సిపల్, కార్పొరేషన్ ఎన్నికలు, రాష్ట్రంలోని 17 మున్సిపల్ కార్పొరేషన్లు, 77 మున్సిపాలిటీలు, మరియు 10 నగర పంచాయతీలకు మొదటి విడతలో ఎన్నికలు నిర్వహించనున్నారు.

  • నామినేషన్ల దాఖలు: అక్టోబర్ 18
  • నామినేషన్ల పరిశీలన: అక్టోబర్ 19
  • నామినేషన్ల ఉపసంహరణ: అక్టోబర్ 21
  • పోలింగ్ తేదీ: అక్టోబర్ 28
  • ఫలితాల విడుదల: అక్టోబర్ 30

రెండో దశలో భాగంగా జెడ్పీటీసీ, ఎంపీటీసీ స్థానాలకు పోలింగ్ జరగనుంది.

  • పోలింగ్ తేదీ: నవంబర్ 3
  • ఫలితాల విడుదల: నవంబర్ 5

గ్రామ పంచాయతీల సర్పంచ్, వార్డు సభ్యుల ఎన్నికలను మూడవ విడతలో నిర్వహించనున్నారు. ఈ ఎన్నికల్లో పోలింగ్ ముగిసిన వెంటనే అదే రోజున ఫలితాలను వెల్లడిస్తారు.

  • తొలి దశ పోలింగ్: నవంబర్ 26
  • రెండో దశ పోలింగ్: నవంబర్ 29
  • మూడో దశ పోలింగ్: డిసెంబర్ 2

ఎన్నికలను అత్యంత పారదర్శకంగా, ప్రశాంత వాతావరణంలో నిర్వహించేందుకు అన్ని జిల్లాల కలెక్టర్లు, ఎస్పీలతో ఎస్‌ఈసీ ఇప్పటికే సమీక్ష నిర్వహించి తగిన ఆదేశాలు జారీ చేసింది. గుర్తింపు పొందిన రాజకీయ పార్టీల ప్రతినిధులతో సర్వసభ్య సమావేశం నిర్వహించి ఎన్నికల నిర్వహణపై సలహాలు, సూచనలు తీసుకున్నట్లు కమిషనర్ అనిల్ చంద్ర పునేఠా తెలిపారు. అలాగే తక్షణమే ఎన్నికల నియమావళి అమలై నందు వలన, కొత్తగా ఎటువంటి ప్రారంభోత్సవాలు కానీ పథకాలు కానీ ప్రకటించడానికి వీలు లేదు, కానీ ఇదివరకే జరుగుతున్న అభివృద్ధి పనులు, సంక్షేమ పథకాలు మొదలగు వాటికి ఎటువంటి ఆటంకం లేకుండా నిర్వహించుకోవచ్చు అని ఆయన తెలిపారు.

ANDHRA PRADESH STATE ELECTION COMMISSION

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *