ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామాపై బిజెపి పార్టీ అనుసరిస్తున్న విధానం ఆ పార్టీ యొక్క భవిష్య ప్రణాళికకు శరాఘాతం లాంటిది. ఏదేని నిబద్ధత కలిగిన అధికార రాజకీయ పార్టీలు సరియగు వ్యూహం అనుసరించకపోతే తరవాత జరిగే పరిణామాలకు ఆ యొక్క పార్టీ పూర్తి బాధ్యత వహించవలసి వస్తుంది. నీట్ పరీక్ష నిర్వహణ లోపం మరియు అవకతవకలకు ఆ యొక్క శాఖ మంత్రివర్యులు పూర్తి బాధ్యత వహించాలి కానీ ఇక్కడ దానికి భిన్నంగా వ్యవహరిస్తున్న బిజెపి పార్టీ, దేశ భవిష్యత్తుకు పునాదిరాయి వంటి నీట్ పరీక్షల నిర్వహణలోని బిజెపి ప్రభుత్వం పూర్తిగా ఫెయిల్. సదరు మంత్రిపై వేటు తోను లేదా రాజీనామా తోను ఇలాంటి సంఘటనలు పునరావృతం కావని వారు ప్రజలకు భరోసా ఇవ్వాలి కానీ మోడీ ప్రభుత్వం ఫాసిస్ట్ ధోరణితో మంత్రిని వెనకేసుకు రావడం బిజెపి ప్రభుత్వం బావి తరాలకు ఎలాంటి సంకేతం ఇవ్వ పోతుందో ఇట్టే అర్థమవుతుంది. ఇదే ఒరవడి కొనసాగితే బీజేపీ పార్టీని దేశ ప్రజలు చి కొట్టడం మాత్రం ఖాయం. ప్రజాస్వామ్య వ్యవస్థ అనేది జవాబుదారీతనం అనే ఒక మూల స్తంభం పై నిర్మితమైనది. కానీ ఇలాంటి సంఘటనలతో ప్రజాస్వామ్య వ్యవస్థ అబాసు పాలు అవుతున్నది. ఈ యొక్క సంఘటనతో విశ్వ గురు అయిన మోడీ యొక్క చరిస్మా ప్రపంచవ్యాప్తంగా మసక బారినది. ప్రతిష్టాత్మక ప్రవేశ పరీక్షల నిర్వహణ వైఫల్యాలు, పేపర్ లీకేజీల నేపథ్యంలో కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలంటూ దిల్లీలోని జంతర్ మంతర్ వద్ద కాక్రోచ్ జనతా పార్టీ (CJP) మరియు విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో ఈ రోజున కూడా భారీ నిరసనలు కొనసాగాయి. ఈ ఆందోళనలకు మద్దతుగా పార్లమెంట్ వర్షాకాల సమావేశాలను విపక్షాలు అడ్డుకున్నాయి.
జంతర్ మంతర్ వద్ద ఉద్రిక్తత
- నిరసనల హోరు: మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ వెంటనే పదవికి నైతిక బాధ్యత వహించి వైదొలగాలని డిమాండ్ చేస్తూ వేలాది మంది విద్యార్థులు, యువకులు జంతర్ మంతర్ వద్ద బైఠాయించారు.
- చర్చల తిరస్కరణ: కేంద్ర ప్రభుత్వం చర్చలకు ఆహ్వానించినప్పటికీ, నిరసన స్థలమైన జంతర్ మంతర్లోనే చర్చలు జరపాలని లేదా మంత్రి రాజీనామా చేయాలని సీజేపీ నేతలు స్పష్టం చేశారు.
- అరెస్టులు, భద్రత: ఆందోళనల నేపథ్యంలో దిల్లీ పోలీసులు, పారామిలటరీ బలగాలను భారీగా మోహరించారు.
పార్లమెంట్లోనూ ప్రతిష్టంభన
- విపక్షాల నిరసన: రాహుల్ గాంధీ, మల్లికార్జున ఖర్గే సహా ‘ఇండియా’ కూటమి ఎంపీలు నల్ల దుస్తులు ధరించి పార్లమెంట్ ఆవరణలో ఆందోళన చేపట్టారు.
- సభ వాయిదా: విద్యాశాఖ మంత్రి రాజీనామా చేసే వరకు ఎలాంటి చర్చకు అంగీకరించబోమని విపక్షాలు పట్టుబట్టడంతో పార్లమెంటు ఉభయ సభలు వరుసగా నాలుగో రోజు కూడా వాయిదా పడ్డాయి.