GEN Z ఉద్యమం పోరుతో, కేంద్ర మంత్రి రాజీనామా

Share Now

ఢిల్లీ: నీట్ పేపర్ లీకేజీ వివాదం నేపథ్యంలో దేశవ్యాప్తంగా విద్యార్థుల నుంచి తీవ్ర నిరసనలు వ్యక్తమవడంతో, శనివారం 25 జూలై 2026న కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ తన పదవికి ఎట్టకేలకు రాజీనామా చేశారు. గత ఐదు వారాలుగా ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద యువత, విద్యార్థి సంఘాలు చేపట్టిన సుదీర్ఘ ఆందోళనల తీవ్రతకు కేంద్ర ప్రభుత్వం దిగొచ్చింది. ధర్మేంద్ర ప్రధాన్ తన రాజీనామా లేఖను ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి పంపారు. ఈ విషయాన్ని ఆయన సోషల్ మీడియా వేదిక ‘X’ (ట్విట్టర్) ద్వారా అధికారికంగా ప్రకటించారు. వెంటనే భారత రాష్ట్రపతి రాజ్యాంగంలోని ఆర్టికల్ 75 క్లాస్ 2 ప్రకారం ఆయన రాజీనామాను ఆమోదించారు, అలాగే ప్రధానమంత్రి సలహా మేరకు ధర్మేంద్ర ప్రధాన్ స్థానంలో కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషికి విద్యాశాఖ అదనపు బాధ్యతలు అప్పగించారు.


తన రాజీనామాపై ‘X’ వేదికగా స్పందించిన ధర్మేంద్ర ప్రధాన్.. దేశ యువత ప్రయోజనాల దృష్ట్యా, నైతిక బాధ్యత వహిస్తూ తాను ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు.

“గత పది రోజులుగా జరుగుతున్న పరిణామాలు నన్ను ఎంతో బాధించాయి. ఇది నా వ్యక్తిగత ప్రతిష్ఠకు సంబంధించిన అంశం కాదు. ప్రస్తుత ఉద్రిక్త పరిస్థితులను దేశవ్యతిరేక శక్తులు తమ స్వార్థానికి వాడుకోకూడదనే ఉద్దేశంతోనే నేను తప్పుకుంటున్నాను. ఏ ఒక్క విద్యార్థి భవిష్యత్తు కూడా న్యాయపరమైన చిక్కుల్లో పడకూడదు. పిల్లలు గందరగోళానికి గురికాకుండా తమ చదువుపై, కెరీర్‌పై దృష్టి పెట్టాలి.”


2026 మే 3న జరిగిన NEET-UG పరీక్షల లీకేజీ వ్యవహారం బయటపడినప్పటి నుంచి దేశవ్యాప్తంగా తీవ్ర ఆగ్రహం వ్యక్తమైంది. ముఖ్యంగా, కాక్రోచ్ జనతా పార్టీ (CJP) పేరుతో ‘Gen Z’ యువత డిజిటల్ మరియు క్షేత్రస్థాయిలో చేపట్టిన వినూత్న ఉద్యమం ఈ విజయానికి ప్రధాన కారణమైంది.

ప్రముఖ సామాజిక ఉద్యమకారుడు సోనమ్ వాంగ్‌చుక్ విద్యార్థులకు మద్దతుగా 26 రోజుల పాటు చేసిన నిరాహార దీక్ష, జూలై 20న పార్లమెంట్ మార్చ్ సందర్భంగా విద్యార్థులపై జరిగిన పోలీసు లాఠీచార్జ్ ప్రజల్లో తీవ్ర వ్యతిరేకతను తెచ్చిపెట్టాయి. ప్రధాన్ రాజీనామా మాత్రమే తమ ఏకైక డిమాండ్ అని విద్యార్థులు భీష్మించుకోవడంతో ప్రభుత్వం వెనక్కి తగ్గక తప్పలేదు.


ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేసిన కొద్ది గంటల్లోనే, కేంద్ర మంత్రులు జేపీ నడ్డా, జితేంద్ర సింగ్‌లతో CJP ప్రతినిధులు సౌరవ్ దాస్, అశుతోష్ రంకా జరిపిన మూడో విడత చర్చలు విజయవంతమయ్యాయి. కేంద్ర ప్రభుత్వం విద్యార్థుల డిమాండ్లన్నింటికీ అంగీకరించింది:

  1. నిరసనల్లో పాల్గొన్న విద్యార్థులపై నమోదైన పోలీసు కేసులను (FIRs) ఉపసంహరించుకోవడం.
  2. నీట్ లీకేజీ మనస్తాపంతో ఆత్మహత్య చేసుకున్న విద్యార్థుల కుటుంబాలకు నిబంధనల ప్రకారం పరిహారం అందించడం.

ప్రభుత్వం నుంచి స్పష్టమైన లిఖితపూర్వక హామీ లభించడంతో విద్యార్థులు తమ జంతర్ మంతర్ నిరసనలను శనివారం సాయంత్రం అధికారికంగా విరమించుకున్నారు.


ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామాను విపక్షాలు స్వాగతించాయి. లోక్‌సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ స్పందిస్తూ, “దేశవ్యాప్తంగా ఉన్న విద్యార్థులారా వెల్ డన్, మీ ధైర్యానికి దేశం గర్విస్తోంది, విద్యా వ్యవస్థ ప్రక్షాళనకు ఇది మొదటి అడుగు మాత్రమే” అని పేర్కొన్నారు. ఇటు శరద్ పవార్, అరవింద్ కేజ్రీవాల్ వంటి నేతలు కూడా దీనిని ప్రజాస్వామ్య విజయంగా అభివర్ణించారు. మరోవైపు, బీజేపీ సీనియర్ నేతలు ప్రధాన్ తీసుకున్న నిర్ణయాన్ని ‘నైతిక విలువలతో కూడిన త్యాగం’ అని కొనియాడారు.

నీట్ అవకతవకలపై ఇప్పటికే సీబీఐ (CBI) సమగ్ర దర్యాప్తు జరుపుతోంది. భవిష్యత్తులో ఇలాంటి లీకేజీలు పునరావృతం కాకుండా ఉండేందుకు, వచ్చే ఏడాది నుంచి నీట్ పరీక్షలను పూర్తిగా కంప్యూటర్ ఆధారిత పరీక్ష (CBT) విధానంలో నిర్వహించాలని మరియు కఠినమైన యాంటీ-పేపర్ లీక్ చట్టాన్ని అమల్లోకి తీసుకురావాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఏది ఏమైనా దేశ యువత చేపట్టిన ఈ ఉద్యమంతో ఎంతటి సమస్య నైనా ప్రజా ఉద్యమంతో విజయం సాధించవచ్చు అని తెలిపారు. అంతేకాకుండా మోడీ గారు తన రాజకీయ చతురతతో ఉద్యమాన్ని ఉపేక్షించకుండా ఉద్యమకారులతో చర్చించి కథ సుఖాంతం అయ్యేలా చేయడంతో ఆయన తన రాజకీయ చాణుక్య తను నిరూపించుకున్నారు .

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *