తమిళనాడు తెలుగు యువశక్తి వ్యవస్థాపక అధ్యక్షులు, తెలుగు ఫిల్మ్ ప్రొడ్యూసర్స్ కౌన్సిల్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అధ్యక్షులు కేతిరెడ్డిజగదీశ్వరరెడ్డి గారు ఆంధ్రప్రదేశ్ నూతన గౌరవ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ లిసా గిల్ గారికి హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు. ఆమె ఆంధ్రప్రదేశ్ కి మొట్టమొదటి మహిళ ప్రధాన న్యాయమూర్తి గా ప్రమాణం స్వీకారం చేసిన సందర్భంగా న్యాయ రంగంలో విశిష్ట సేవలు, చారిత్రాత్మక తీర్పులు, న్యాయపరమైన నిబద్ధతతో మంచి పేరు సంపాదించిన ఆమె నేతృత్వంలో ఆంధ్రప్రదేశ్ న్యాయవ్యవస్థ ప్రజలకు మరింత చేరువ అవుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు.
మహిళలపై జరుగుతున్న నేరాలు, డ్రగ్స్, గంజాయి సాగు, మాదకద్రవ్యాల అక్రమ రవాణా వంటి సామాజిక సమస్యలపై త్వరితగతిన తీర్పులు తీసుకోవాలని, అవసరమైతే కేసులను సుమోటోగా స్వీకరించి ప్రజలకు న్యాయం జరిగేలా చూడాలని జగదీశ్వరరెడ్డి ఆ ప్రకటన లో విజ్ఞప్తి చేశారు. ఆమె పదవీకాలం న్యాయం, సమానత్వం, ప్రజా సంక్షేమం దిశగా చరిత్రాత్మకంగా నిలవాలని ఆకాంక్షిస్తూ మరోసారి అభినందనలు తెలుపుట ఒక సామాజిక కార్యకర్తగా తన బాధ్యత అని
కేతిరెడ్డి జగదీశ్వరరెడ్డి ఒక ప్రకటన లో తెలిపారు