తాడేపల్లి: పట్టణ ప్రాంత పేదరిక నిర్మూలన సంస్థ (మెప్మా) నూతన మిషన్ డైరెక్టర్‌గా సీనియర్ ఐఏఎస్ అధికారి శ్రీ జి. బాలకృష్ణ, IAS అధికారికంగా బాధ్యతలు స్వీకరించారు. తాడేపల్లిలోని మెప్మా ప్రధాన కార్యాలయంలోని తన ఛాంబర్‌లో ఆయన ఈ రోజు బాధ్యతలను స్వీకరించడం జరిగింది.
నూతన మిషన్ డైరెక్టర్ బాధ్యతలు స్వీకరించిన సందర్భంగా కార్యాలయ అధికారులు, సిబ్బంది ఆయనకు ఘన స్వాగతం పలికారు. ఈ కార్యక్రమంలో మెప్మా అడిషనల్ మిషన్ డైరెక్టర్ శ్రీ కె.ఎన్. వెంకటేశ్వరరావు, అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ (AO) శ్రీమతి ఉషా కిరణ్‌లతో పాటు స్టేట్ మిషన్ కోఆర్డినేటర్లు (SMCs), స్టేట్ మిషన్ మేనేజర్లు (SMMs) పాల్గొన్నారు.
నూతన డైరెక్టర్‌కు పుష్పగుచ్ఛాలు అందించి, ఘనంగా సన్మానిస్తూ తమ హృదయపూర్వక స్వాగతాన్ని మరియు శుభాకాంక్షలను తెలియజేశారు. శ్రీ జి. బాలకృష్ణ గారి నాయకత్వంలో మెప్మా సంస్థ మరింత విజయవంతంగా ముందుకు సాగుతుందని, పట్టణ పేదరిక నిర్మూలన మరియు మహిళా సాధికారత కార్యక్రమాలు మరింత ప్రభావవంతంగా అమలు కాగలవని వారు ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా కొత్త మిషన్ డైరెక్టర్ అధికారులతో కలిసి సంస్థ ప్రగతిపై ప్రాథమికంగా సమీక్షించారు. అలాగే కూటమి ప్రభుత్వం ఏర్పడిన 28 నెలల కాలంలో మిషన్ డైరెక్టర్ గా ఇది మూడవ నియామకం, మెప్మా పరిధిలో కల పట్టణ పేద మహిళల స్థితిగతులను మార్చగలిగే పలు సమస్యల పరిష్కారానికి ఆయన చొరవ చూపాలని సంఘ దర్శిని వారిని కోరుతోంది.