మున్సిపల్ ఎలక్షన్ పోరులో పుంగనూరు, రాయచోటి, తాడిపత్రి, ఆళ్ళగడ్డ ఇలా ఆంధ్రలో అనేక పట్టణాల్లో గత రెండు రోజులుగా ఏం జరుగుతోంది? రెడ్ బుక్ వర్సెస్ రప్ప రప్ప రాజకీయం నడుస్తోంది. చంద్రబాబు, జగన్ కుటుంబాల మధ్య, ఆ రెండు కుల, మైనారిటీ కుటుంబాలు పోషిస్తున్న ఫ్యాక్షన్ల మధ్య ఓ సివిల్ వార్ నడుస్తోంది. ఆంధ్రప్రదేశ్లో శాంతి భద్రతలు ఎంత ఘోరంగా ఉన్నాయో కర్రలు, కత్తులు, గూండాలు, బౌన్సర్లు, నామినేషన్లు చింపేయటాలు, జీపులతో ఢీకొట్టడాలు, నెత్తురోడేలా దాడులు ఇలాంటి విజువల్స్ ద్వారా మిగతా దేశానికి చూపిస్తున్నాయి. పరిస్థితి చూస్తుంటే ఇక 2029 జనరల్ ఎన్నికల్లో ఈ పార్టీలు నేరుగా బందిపోట్లకు, హత్యలు, మానభంగాలు, దొంగతనాల చరిత్ర ఉన్నవారికి మాత్రమే ఆ రెండు పార్టీలు పోటీపడి మరీ సీట్లు ఇస్తాయని అర్థం చేసుకోవాలి. ఇదే అరాచకం ఇకమీదటా కొనసాగాలా? లేక, ఈ రెండు పార్టీలకు గుణపాఠం నేర్పే మూడవ ప్రత్యాయామ్నాo తో సరికొత్త రాజకీయానికి మన జెన్–జీ నడుం బిగించాలా అన్నది నిర్ణయించు కోవాలి నవంబర్ రెండో వారంలో అందరం కలుద్దాం గెట్ రెడీ, అంటూ సామాజిక మాధ్యమం ఎక్స్ వేదికగా విజయసాయి రెడ్డి గారు ఆంధ్రప్రదేశ్ ప్రజలకు తనదైన శైలిలో పిలుపునిచ్చారు. ఇంత జరుగుతున్న పోలీసులు ప్రేక్షక పాత్ర వహించడం చూస్తుంటే ఇక అసెంబ్లీ ఎన్నికల హోరు యుద్ధ తంత్రాలను తలపించే విధంగా ఉండబోతుంది అనేది తేటతెల్లమవుతుంది.
