క్షీణిస్తున్న నీట్ ఉధ్యమ కారుడు సోనమ్ ఆరోగ్యం…

Share Now

ఢిల్లీ: నీట్ (NEET) పరీక్షల అవకతవకలపై కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలనే డిమాండ్‌తో ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద సోనమ్ వాంగ్‌చుక్ చేపట్టిన నిరవధిక నిరాహార దీక్ష 19వ రోజుకు చేరింది. సుదీర్ఘంగా సాగుతున్న ఈ ఉపవాసం కారణంగా ఆయన శారీరక పరిస్థితి తీవ్రంగా ఆందోళనకరంగా మారింది.వాంగ్‌చుక్ ప్రాణాపాయ స్థితిలో ఉన్నారంటూ దాఖలైన పిల్ (PIL) పై ఢిల్లీ హైకోర్టు గురువారం కీలక విచారణ జరిపింది. “దేశంలో ప్రతి ఒక్క పౌరుడి ప్రాణం విలువైంది” అని స్పష్టం చేస్తూ, కేంద్ర, ఢిల్లీ ప్రభుత్వాలకు న్యాయస్థానం కీలక ఆదేశాలు జారీ చేసింది.

  • నిరంతర నిఘా: వాంగ్‌చుక్ ఆరోగ్య పరిస్థితిని ప్రతిరోజూ ప్రభుత్వ వైద్యుల పర్యవేక్షణలో తనిఖీ చేయాలి.
  • వైద్య సాయం: అవసరమైన తక్షణ అత్యవసర వైద్య చికిత్సను ప్రభుత్వమే అందించాలి.

దీక్ష ప్రారంభమైనప్పటి నుంచి వాంగ్‌చుక్ శరీరంపై తీవ్ర ప్రభావం పడిందని సీనియర్ ఫిజీషియన్ డాక్టర్ సతీష్ లంబా మరియు కాక్రోచ్ జనతా పార్టీ (CJP) ప్రతినిధులు వెల్లడించారు.

  • బరువు తగ్గడం: 19 రోజుల్లో ఆయన ఏకంగా 9 కిలోల బరువు కోల్పోయారు. ప్రస్తుతం ఆయన బరువు 56.9 కిలోలుగా ఉంది.
  • కండరాల క్షీణత: ఆహారం లేకపోవడంతో శరీరంలో కండరాలు కరిగిపోతున్నాయి (Muscle breakdown). దీంతో తీవ్రమైన కండరాల నొప్పితో ఆయన బాధపడుతున్నారు.
  • యూరిక్ యాసిడ్ పెరుగుదల: కండరాల క్షీణత వల్ల శరీరంలో యూరిక్ యాసిడ్ స్థాయిలు ప్రమాదకరంగా పెరుగుతున్నాయి. ఇది రాబోయే రోజుల్లో అంతర్గత అవయవాల వైఫల్యానికి (Organ damage) దారితీసే అవకాశం ఉందని వైద్యులు హెచ్చరిస్తున్నారు.
  • వైటల్స్: ప్రస్తుతం ఆయన బ్లడ్ షుగర్ లెవెల్ 80 mg/dL గా, పల్స్ రేటు నిమిషానికి 72 గా నమోదైంది.

అరవింద్ కేజ్రీవాల్, అఖిలేష్ యాదవ్, మమతా బెనర్జీ, ఉద్ధవ్ ఠాక్రే వంటి పలువురు విపక్ష నేతలు, సినీ ప్రముఖులు ఆయనను దీక్ష విరమించాలని కోరారు. అయితే, వాంగ్‌చుక్ అందుకు నిరాకరించారు. “నా ఆరోగ్యం క్షీణిస్తున్న మాట నిజమే, కానీ నన్ను దీక్ష ఆపమని అడగొద్దు, విద్యార్థుల భవిష్యత్తు కోసం చేస్తున్న ఈ పోరాటంలో ప్రభుత్వం మాతో ఎందుకు చర్చలు జరపడం లేదో వారిని ప్రశ్నించండి” అని ఆయన స్పష్టం చేశారు. అలాగే జూలై 20న పార్లమెంట్ వైపు చేపట్టే శాంతియుత మార్చ్‌లో ప్రజలందరూ పాల్గొనాలని పిలుపునిచ్చారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *