డిలిమిటేషన్ లో దక్షిణాది కి అన్యాయం చేస్తే సహించేది లేదని కేతిరెడ్డి జగదీశ్వరరెడ్డి అన్నారు, దక్షిణాది రాష్ట్రాలపై జరుగుతున్న వివక్షకు వ్యతిరేకంగా ఒక ఐక్య ఉద్యమం ప్రారంభమైందని, దేశ సమగ్రాభివృద్ధికి కీలకంగా నిలిచిన దక్షిణాది రాష్ట్రాలపై కేంద్ర ప్రభుత్వం అవలంబిస్తున్న వివక్షాత్మక విధానాలపై గళం విప్పాల్సిన అవసరం ఏర్పడిందని, కేంద్ర ప్రభుత్వం ప్రస్తుతం డీలిమిటేషన్ ని వెంటనే అమలులో కి తీసుకోని రాకూడదని, దక్షిణాది లో గల వివిధ రాజకీయ పార్టీల తో సంప్రదింపులు జరిపిన తరువాతే తుది నిర్ణయం తీసుకోవాలని తమిళనాడు తెలుగు యువశక్తి వ్యవస్ధాపక అధ్యక్షుడు కేతిరెడ్డి జగదీశ్వరరెడ్డి కేంద్ర ప్రభుత్వం ను ఒక ప్రకటన లో కోరారు.
కేతిరెడ్డి జగదీశ్వరరెడ్డి ఆ ప్రకటన లో “తమిళనాడు ముఖ్యమంత్రి యం.కె.స్టాలిన్ నిన్న ఈ డిలిమిటేషన్ అంశంపై స్పష్టంగా పేర్కొన్న ప్రకారం
“దక్షిణాది రాష్ట్రాలపై జరుగుతున్న అన్యాయాన్ని ఇక మేము సహించబోము అని, మా హక్కుల కోసం అవసరమైతే మరింత పెద్ద స్థాయిలో పోరాటం చేస్తాము అని తెలిపియున్నారు.”
దక్షిణాది రాష్ట్రాలు ఎప్పటికీ దేశాభివృద్ధికి వెన్నెముకగా నిలిచాయి కానీ ప్రాతినిధ్యం, వనరుల పంపిణీ, విధానాల అమలు విషయంలో జరుగుతున్న వివక్షను ఇకపై సహించబోము. ఈ ఉద్యమం కేవలం ఒక ప్రాంతం కోసం కాదు ఇది సమానత్వం, న్యాయం, ఫెడరల్ స్ఫూర్తి కోసం సాగుతున్న పోరాటం
దక్షిణాది ఒకటైతే దేశ రాజకీయ దిశ మారుతుంది. దక్షిణాది వివక్ష పై తన అభిప్రాయం ను చాలా స్వష్టం గా తెలియచేసారని
దక్షిణాది వివక్ష కి గురి అవ్వుతుందన్న సంగతులు దక్షిణాది పన్నుల రూపంలో కేంద్రా నికి చెల్లించునది ఎంత, తిరిగి మనకు దక్కుతున్నది ఎంత అన్న నినాదం నేపధ్యంలో
కేరళ, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ (అప్పటి ముఖ్యమంత్రి), పుదుచ్చేరి, కర్ణాటక మరియు తమిళనాడు ముఖ్యమంత్రులు, అలాగే వివిధ ప్రతిపక్ష పార్టీ నాయకులను కలిసి దక్షిణాది హక్కుల పరిరక్షణను వారి దుష్టికి తీసుకు రావటం జరిగిందని అందులో భాగంగా హోసూర్ నందు ధర్నా కూడా చేయడం జరిగిందని, ముఖ్యంగా డిలిమిటేషన్ (పరిధుల పునర్విభజన) ఉత్తరాది రాష్ట్రలకు పార్లమెంటు స్థానాలు ఏక్కువగా పెరుగుటకు అవకాశం ఉందని, దక్షిణాది కి సీట్ల సంఖ్య తక్కువగా పెరుగుటకు అవకాశం ఉందని కావున దక్షిణాది రాష్ట్రాలకు అన్యాయం జరిగితే తప్పకుండా దక్షిణాది ప్రజలందరూ హక్కుల కొరకు ఉప్పొంగే తరంగం లా తరలి వచ్చి ఉద్యమానికి సిద్ధం అవ్వాలని, అలాగే రాజకీయ పార్టీలు పార్టీలకు అతితంగా ఉద్యమించాలని కేతిరెడ్డి కోరారు.