బోర్డు తిప్పేసిన మరో రియల్ ఏస్టేట్ సంస్ధ తేజు డెవలపర్స్ ప్రైవేట్ లిమిటెడ్

Share Now

నెల్లూరు : మద్య తరగతి ప్రజల చిరకాల స్వప్నం కూడ పెట్టిన సొమ్ముతో ఇల్లు కట్టుకోవడమే కానీ కొందరు రియల్ కేటుగాల్ల మాయతో వాల్లు నిరంతరం మోసపోతూనే ఉన్నారు. ఏన్ని చట్టాలు తెచ్చినా కేటుగాల్ల పని మాత్రం నిర్విరామం గా నిరాటంకంగా ప్రభుత్వ అధికారుల సహాయ సహకారాలతో సాగిపోతూనే ఉన్నది, దీనితో మధ్య తరగతి ప్రజలు మరో సారి మోస పోయాం అని సరిపెట్టుకుంటున్నారు. అలాంటి సంఘటనే తేజు డెవలపర్స్ ప్రైవేట్ లిమిటెడ్ అనే సంస్ధ, డైరెక్టర్ తోటా శ్రీనివాసులు రెడ్డి నెల్లూరు వేదికగా ఓ భారీ మోసానికి తెర లేపాడు, హైదరాబాద్ నగరంలో పేరెన్నిక గల 30 లే ఔట్లు వేశాం అని నమ్మబలికి పలువురు ఏజంట్లను మల్టీ లెవెల్ మార్కెటింగ్ లో ముందుగా నియమించుకున్నారు. వీరికి అత్యదిక మొత్తంలో గజానికి కమిషన్ ఆశ చూపి ఫ్లాట్లు విక్రయించారు.

తీరా చూస్తే మతలబు ఏంటంటే గతంలో వీరు తెలంగాణలో వేసిన పలు లేవుట్ లలో అవకతవకలకు పాల్పడి వినియోగదారులను మోసం చేసి ఉన్నారు, ఈ సంస్ధకి 2023 వ సంవత్సరం వరకు వీరికి ఆంధ్రప్రధేశ్ లో ఏలాంటి లేఅవుట్ వేసిన అనుభవం లేక పోయినా వీరు 26 ఎకరాల భారీ లేఅవుట్ ఇంధ్రప్రస్ధా లే ఔట్, పేడూరు గ్రామం, తోటపల్లి గూడూరు మండలంలో వేశారు. ఈ లేఔట్ నందు మైనర్ బాలిక పేరుతో సర్వే నంబర్ 39/1A లో ఓక ఏకరా పొలం ఉండడమే, ఏకంగా మైనారిటీ కూడా తీరని ఆ బాలిక పేరు B. శ్రీపూజా మీదే లేఔట్ పర్మిషన్ తేవడం అంటే మైనర్ పిల్లల ఆస్తుల పరిరక్షణ చట్టాలను నెల్లూరు ప్రభుత్వ అధికారులు ఎలా తుంగలో తొక్కారు, రియల్ ఎస్టేట్ దొంగలతో కుమ్మక్కై ఎంతటి తీవ్రమైన నేరానికి తెర లేపారు అనేది ఈ లేఔట్ కన్వర్షన్ మరియు NUDA అప్రూవల్ లోనే తెలుస్తోంది. ఇతరత్రా న్యాయపరమైన సమస్యలు తలెత్త గలిగే లేఔట్ అప్రూవల్ ఎలా చేశారు అనే దానిపై ప్రత్యేక దర్యాప్తు సంస్థల విచారణలో తేల వలసిందే. అలాగే 2025 సంవత్సరంలో NUDA వైస్ చైర్మన్గా పనిచేసిన కొల్లా బత్తుల కార్తీక్, ఐఏఎస్ అధికారి గారు స్వయంగా మైనర్ బాలిక పేరుతో నోటీసులు ఇవ్వడం కూడా ఆక్షేపణీయం అలాగే మానవ హక్కుల, మైనర్ బాల బాలికల హక్కుల ఉల్లంఘన కిందకు వస్తాయి.

దీనిపై సత్వర సమగ్ర విచారణ జరపమని ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి పలువురు విజ్ఞాపనలు చేసిన పిమ్మట వారు జిల్లా కలెక్టర్ వారికి ఆజ్ఞాపించినను నెల్లూరు జిల్లా కలెక్టర్ గారికి వినతులు పెట్టినా మోస పోవడం మీ తప్పు కానీ, మోసం చేయడం ఓ ఆర్టు అనే రీతిలో జిల్లా అధికారుల తీరు ఉంది తప్ప ఇప్పటి వరకూ ఏటువంటి చర్యలు ఆ సంస్ధ పై లేవు. ఇప్పటికైనా ఇంధ్రప్రస్తా లేఔట్ పై సరియైన విచారణ జరిపి భాథ్యతా రాహిత్యంగా వ్యవహరించిన రెవెన్యూ అధికారులు, నూడా అధికారుల పై అలాగే తేజు డెవలపర్స్ యాజమాన్యం పై క్రిమినల్ ప్రాసిక్యూషన్ చేయవలెనని బాధితులు వేడుకొనుచున్నారు. 2019 నుండి 2024 మధ్య కాలంలో రెవెన్యూ డిపార్ట్మెంట్, నూడా లలో ఇంకా ఇలాంటి కుంభకోణాలు ఏదైనా జరిగాయా అనే కోణంలో ప్రభుత్వం CB-CID చే ప్రత్యేక ధర్యాప్తు జరిపితే తేజు డెవలపర్స్ లాంటి మరెన్నో బోగస్ సంస్ధల భండారం బయట పడుతుంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *